కట్టా శ్రీనివాస్ ఫెస్టివల్ ఎకనమిక్స్


రంజాన్, బోనాల హడావిడితో పాటు ఈ రోజు ప్రెండ్ షిప్ డే కూడా నగరంలో సమాంతరంగా ప్రవహించటం భలేగా అనిపించిది. దండలుగా వేళ్ళాడుతున్న ప్రెండ్ షిప్ బ్యాడ్లను చూస్తే వాటి వెనకున్న బ్రాండ్లు కొంచెం కదిలించేసరికి మీతో నాలుగు ముక్కలు పంచుకుందాం అనిపించింది.

వ్యాపారంలో ఒక కుదుపుకు, విస్తరణకూ, త్వరణకారికతకూ, ఉత్ప్రేరకాలుగా
పండుగలు ఉపయోగపడతాయనే నిజం తెలిసిందే అయినా ఏ పండుగ సంస్కృతి ధనాన్ని ఏ దిశగా ప్రవహింపజేస్తుందో ఒకసారి స్థూలంగా చూడండి. మారుతున్న జీవన విలువలు ఆదాయపు ప్రవాహాన్ని ఏయో పాయలను ఎటు పంపిస్తుందో గమనించండి ఆఖరుగా ఏ సముద్రంలో కలుస్తున్నాయి. 

అసలేం ఖర్చు వద్దని డొప్పలో ముడుచుకుని సంతోషపు ప్రేరణలు వద్దనటం కూడా సమంజసం కాదు. డబ్బు మన దైహిక, సామాజిక, మానసిక అవసరాలను సమాజిక పద్దతులకు ఇబ్బందిలేని పద్దతిలో తీర్చుకునేందుకు మన శ్రమను మారకం వేసుకునేందుకు తయారు చేసుకున్న నిల్వరూపం గా చూస్తే చాలు కదా.

ఒకప్పుడు వ్యక్తిగత శుభకార్యాలకో, సామాజిక సంభంద పండుగలతో ఏర్పరచుకున్న పద్దతులు వారికి అప్పటికి సమంజసం అనిపించిన సామాజిక అల్లికను భద్రంగా చూసుకునేందుకూ, పోగుపడ్డ సంపదను తహతుకు తగిన పద్దతిలో లోకల్ వ్యాపనం జరిగేలా చూసేవారు. నాగరికత మారింది. శాస్త్రీయత సమగ్రం కాకపోవటం నిజానికి సామాజికాంశాల సమతూకం విషయంలో అది పట్టింపులేని తనాన్ని కలిగుండటంతో వ్యాపార సంస్క్రుతి ఈ మెత్తం కార్యక్రమాన్ని హస్తగతం చేసుకుని తనఆదీనంలో నడిపిస్తున్నా విషయం కొంచెం స్పృహతో గమనిస్తే తేటతెల్లంగానే కనిపిస్తుంది. జీవితం మొత్తాన్ని డబ్బుగాటన కట్టటమే అభ్యున్నతనే స్థితిలో నడిపించటం కూడా చూడొచ్చు.

స్నేహితుల దినం, తల్లి దినం, తండ్రి దినం, హప్పీ న్యూ ఈయర్లూ మన సంస్క్రుతిలోకి ఎక్కడినుంచి దూరాయి అవి అసలు ఎందుకు మన దగ్గరకు వచ్చాయి. వాటిని నిర్వ హించటం అంటే ఏమిటి? శుభాంకాంక్షల కార్డులూ, సిల్కు బొమ్మల బ్యాండులు, అంతర్జాల సర్విసులు, ఫోన్ కాల్స్, సంక్షిప్త సందేశాలూ, మన జేబులో ఏ మూలనుంచి రూపాయిని కత్తిరించి ఏ మూలకు పంపుతున్నాయని ఒకసారి చూడండి. దేశ సరిహద్దు దాటే కంపెనీలూ,దేశంలో వుండి శాతాల సంభందాలతో నిర్వహిస్తున్నా కంపెనీల ఉత్పత్తుల మాయ. ఆ మాయ విడిపోకుండా నిరంతరం ఆ మాయపొరలు వీడిపోకుండా హిప్నటైజ్ చేసే మార్కెటింగ్, అడ్వర్టయిజ్ మెంట్ల సంస్క్రుతి.

దీన్ని పటా పంచలు చేసే ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించటమో, సాంప్రదాయకంగా వున్న పద్దతులలోని లోపాలను సవరించుకుంటూ నూతన ఫంథాలను ఏర్పాటు చేసుకోగలగటం సాధ్యం కాదా? ఆధునికత అంటే, నయా శాస్త్రీయత పేరు చెప్పటం అంటే అంతర్ఝాతీయ వ్యాపార వలల్లో మరింత బలంగా చిక్కుకోవటమా.


ఎవరో ఒక్కరన్నా వుండరా మన ఆలోచనలను అర్ధం చేసుకునేవారు. లేదా మరింత మెరుగైన ఆలోచన వుంటే సరిచేసే వారు అన్న ఆశతోనే ఈ నాలుగు ముక్కలూ పంచుకుంటున్నాను. ప్రవాహంలో వున్నవారికి బోరనిపిస్తే మన్నించండి. 




కామెంట్‌లు