గూగుల్ పుట్టిన రోజు ఎప్పుడు ?

ప్రపంచాన్ని చూపించే కళ్ళను వాటినవి చూసుకునేది చాలా తక్కువే దానీకీ ఏదో అద్దం సహాయం తీసుకుంటేనే. ప్రపంచంలోని ఏ పదం కోసం ఎంత మంది వెతికారో తెలియాలంటే గూగుల్ ట్రెండ్స్ అనే ఆప్షన్ సహాయంతో టాప్ టెన్ ఏవీ ఈ వారంలో ఏ పదాలు వెతికారు. ఏ ప్రాంతంలో ఏ పదాలకోసం బాగా వెతికారూ లాంటి విషయాలు చూడొచ్చు. పాపం గూగుల్ లో వెతుకుతారు కానీ గూగుల్ కోసం వెతకరు కదా. సెర్స్ ఇంజన్ అనే మాటని నెటిజన్స్ ఎప్పుడో మర్చిపోయారు దానికి పర్యాయ పదంగా గూగుల్ మారిపోయింది. కానీ ఎప్పుడూ మన బుజం మీద చెయ్యేసుకుని పక్కనే వుండే మిత్రుడి లాంటి గూగుల్ కోసం వెతుకులాడాల్సిన అవసరం ఎందుకొస్తుంది? కానీ అలెక్సా లాంటి వెబ్ సైట్ లకు ర్యాంకింగ్ లను ఇచ్చే యంత్రాలలో గూగుల్ వెబ్ ది అన్ని చోట్లా ప్రధమ స్థానం. అయితే ఇంతకీ గూగుల్ అనే పదం ఏంటి ? దాని పేరు వెనకున్న కథ ఏమిటి అనేది తెలుసా?


వెతికితే కొన్ని అబ్రివేషన్లు ఇలా దొరికాయి.

GOOGLE                  Giving Opinions & Options Generously Linked Everywhere





Google
Gradually Overcoming Our Ghastly Legal Environment
GOOGLE
God's Only Online Gateway Linking Electronically
GOOGLE
Girl's Only Online Liberal Engagement
GOOGLE
Gradually Overcoming Obstacles by God's Love & Eternity
Google
Great Opportunity to Operationalize a Gullible Luddite Exploitation
GOOGLE
Gracios Opinions Of God's Living Entities
Google
Gargantuan On-Line Operation of Government Law Enforcement
GOOGLE
General Oblivion and Omnipotent Guide to Lots of Everything

Google
10^100 (Ten to the power of one hundred; ten followed by hundred zeros)

Google
Good Offers Other Games Like Examples?

GOOGLE
General Orientation Over Gobblins Legal Enterprise
Google
Global Online Options and Greatly Linked Education
GOOGLE
Global Organization of Oriented Group Language of Earth
కానీ వారి అధికారిక వెబ్ సైట్ లో మాత్రం దీనికి ఎటువంటి పదల వివరణ వున్నట్లు పేర్కోనలేదు. కానీ దాని శక్తి గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్చింది. గూగోల్‌ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య.కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్‌ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.
లారీల పేజీలు చూస్తే సర్జరీనే మరి !! 
 సామర్ధ్యాలను తెలియజేసేలా ఆ పేరు ఏర్పాటు చేసారంటారు.


గూగుల్ యొక్క ప్రధాన వ్యాపారం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ మీదే ఆధారపడి ఉంది. దీనిలో ముఖ్య పదాల ఆదారంగా సంభందిత అంశం గుర్చిన సమాచారం(వెబ్సైటులు) తో పాటు చిత్రాలను, వార్తా విశేషాలతో పాటూ పరిశీలన చేయబడిన శాస్త్రీయ వ్యాసాలకు సందించిన సమాచారం కొరకు కూడా వెతకవచ్చు. దీనితో పాటు వెబ్-ఆదారిత ఈ -మెయిల్(G-mail), ఆన్ లైన్ మ్యాపింగ్(maps.google),

ఆఫీసు ప్రొడక్టివిటీ(Google Apps), సోషల్ నెట్ వర్కింగ్(Orkut) ( గూగుల్ ప్లస్ ) వీడియో షేరింగ్(youtube) లాంటి అనేక రకాలైన నూతన ఉపయోగకర ఉత్పత్తులను ఆధునిక సమాజానికి అందించింది. ఇదెలా సాధ్యపడింది అని కొంచెం పరిశీలించి చూస్తే వారు తమ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలూ, వారి వారి పనిలో స్వేచ్ఛా ఎంత భిన్నంగా సృజనాత్మకంగా వుంటాయో ఎన్నో సార్లు బెస్ట్ కంపెనీగా ఎన్నికయిన తన చరిత్ర చెపుతుంది. ఇంకొంచె బాగా వివరించేందుకు ఈ ఉదాహరణ ఉపయోగపడుతుందేమో. ప్రతీ గూగుల్ ఇంజనీరు తమ పని గంటలలో 20 శాతం సమయాన్ని తనకు నచ్చిన ప్రాజెక్ట్ పైన పని చేసే వీలు కల్పించబడింది.ఈ సమయాన్ని వారంలో ఒక రోజు కానీ మొత్తం కేటాయించిన సమయాన్ని సమీకరించి ఒక నెలగా కానీ వాడుకోవచ్చు. చాలా మంది గూగుల్ ఐ.పి.ఓ తో కంపెనీ కల్చర్ లో మార్పు వస్తుందని ఊహించారు,. ఉద్యోగుల ప్రయోజనాలు షేర్ హోల్డర్ల ఒత్తిడి వలనో, లేక కాగితం మీద కోటీశ్వరులవడం మూలానో మారవచ్చని ఊహించారు.. కానీ అలాంటివీ ఐ.పీ.ఓ వల్ల జరగవని గూగుల్ సృష్టికర్తలయిన సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ లు ఒక నివేదికలో పేర్కొన్నారు తరువాత పేజ్ "మేము మా సంస్కృతి, సరదా తత్వం కాపాడటానికి చాలా ఆలోచిస్తామని" అన్నారు.

గూగుల్ తమ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వంటకు అవసరమైన పదార్థాలను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు స్నాక్స్, పళ్లరసాలను ఆఫీస్ ప్రాంగణంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది.
గూగుల్ తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత ఫిట్నెస్ తరగతులను నిర్వహించటంతో పాటు ప్రత్యేక వ్యాయమశాలలను ఏర్పాటు చేస్తోంది. ( తిండిగలిగితె కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని చెప్పుకుంటే చాలదు ఆచరణలో ఇలా చూపించ గలగటం గొప్ప)

గూగల్ కార్యాలయాల్లోని పనివాతవరణం స్వచ్చమైన ఆహ్లాదాన్ని పంచుతుంది. ఒత్తడిని దరిచేరనివ్వదు. రోజు కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.

గూగుల్ తమ ఉద్యోగులకు పెంపుడు జంతువులను వెంట తీసుకువచ్చే వెసలుబాటను కల్పిస్తోంది.
ప్రసూతి సెలవు నిమిత్తం తల్లిదండ్రులకు ప్రత్యేక సెలవు కేటాయింపుతో పాటు బోనస్‌లను గూగుల్ కల్పిస్తోంది.
సంస్థ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి సంవత్సర వేతనాన్ని ఏటా ఒకేసారి ఆ వ్యక్తి జీవితభాగస్వామికి చెల్లిస్తారు. పదేళ్ల పాటు ఈ విధంగా ఇస్తారు. అంతేకాకుండా సంస్థల్లో ఉద్యోగి పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకూ ప్రతినెలా వెయ్యిడాలర్లు (దాదాపు రూ.55వేలు) అందజేస్తారు. ఆ పిల్లలు విద్యార్థులైతే 23 ఏళ్లకు వరకు స్కీమ్ వర్తిస్తుంది.

ప్రపంచ సమాచారాన్ని వ్యవస్థీకృతం చేసి దాన్ని సార్వత్రికంగా అందుబాటులోనూ, ఉపయోగకరం గానూ వుండేలా చేయటమే గూగుల్ ఆశయంగా పేర్కొంటారు. (Google’s mission is to organize the world’s information and make it universally accessible and useful.) ఈ అద్భుతాన్ని సాధించిన స్వాప్నికులు లారీ పేజ్, సర్గీ బిన్ ( ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే తమాషాగా లారీ ల కొద్ది పేజీలను చూస్తే సర్జరీనే బ్రెయిన్ కి అనుకోవచ్చేమో తమాషాకి.


4వ తారీఖు సెప్టెంబర్‌ 1998 వ సంవత్సరంలో ఒక ప్రైవేటు ఆధీనములో ఉన్న కార్పోరేషను గా స్థాపించబడింది. నీల్సెన్ కాబినెట్ ప్రకారం ఇతర శోధనాయంత్ర ప్రత్యర్ధులు, యాహూ (23%),ఎమ్.ఎస్.ఎన్‌ (13%)ను దాటి 54% మార్కెట్‌ వాటా కలిగి ఉంది గూగుల్‌.గూగుల్ రోజుకి ఒక వంద కోట్ల అభ్యర్ధనలను స్వీకరిస్తుంది!


ఆధారం
గూగుల్ వెతుకులాట యంత్రం
గూగుల్ పై వికీ సమాచారం
గూగుల్ అధికారిక బ్లాగు
.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి