మన వేమన్నకు ముందువాడు బసవణ్ణ

జీవితంలోని వివిధ కోణాలను వాడుక మాటలతో జనానికి సులభంగా అర్ధం అయ్యేలా వచించిన మహాపురుషుడు కన్నడ నేలపై 880 సంవత్సరాల క్రితం పుట్టాడు. కుల రహిత సమాజాన్ని 12వ శతాబ్దంలో ప్రబోధించి ఆచరించి చూపించిన క్రియాశీలి, సత్యము, అహింస, భూతదయ గురించి ఎన్నో అనుసరించదగిన వచనాలను వచించిన మహాపురుషుడు బసవడు. గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, సద్గుణ సంపన్నుడు, అసమాన మేధాసంపన్నుడు అయిన మహాత్మా బసవేశ్వర. బసవేశ్వరుడు (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని మరియు విశ్వగురు అని పిలుస్తారు. 

కర్ణాటకలోని ‘హింగుళేశ్వర బాగెవాడ’ ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. అందుతున్న చారిత్రక ఆధారాల మేరకు జీవన కాలం 1134–1196 మధ్యలో చిన్న వయసులోనే శైవ పురాణ గాధలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయాలనుకున్న తల్లిదండ్రులను వదలిపెట్టి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం చేరుకున్న బసవుడు అక్కడ వున్న సంగమేశ్వరుణ్ణి నిష్టతో ధ్యానించాడు. దేవుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, దేవుడు ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు.

భక్తి బండారీ బసవనిగా అతని నిబద్దతను సూచించే కథ ఒకటి వాడుకలో వుంది.

బీదర్ జిల్లాలోని బసవకళ్యాణ్ పట్టణంలో నిర్మించిన
108 అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం
ఓసాయం సంధ్యవేళ దీపం వెలుతురులో మహాత్మా బసవేశ్వరుడు ఏదో చదువుతూ కూర్చొన్నాడు. ఆయన్ని కలవడానికి కొందరు పెద్దలు వచ్చారు. అందరూ బసవేశ్వరుడికి నమస్కరించి కూర్చొన్నారు. వారంతా ఏదో పనిబడి తనవద్దకు వచ్చారని గ్రహించిన బసవేశ్వరుడు ‘‘నావద్దకు వ్యక్తిగత పని గురించి వచ్చారా? లేదంటే ప్రభుత్వ పని గురించి వచ్చారా?’’ అని ప్రశ్నించాడు.
‘‘మతపరమైన చర్చ గురించి మీవద్దకు వచ్చాం’’ అన్నారు పెద్దలు.
వెంటనే బసవేశ్వరుడు అప్పటివరకు ఏ దీపం వెలుగులో తాను పనిచేసుకుంటున్నాడో, ఆ దీపాన్ని ఆర్పివేసి, మరో దీపం వెలిగించి వారితో మాట్లాడటానికి సిద్దమయ్యారు.
విషయం పెద్దలకు అర్థంకాలేదు. దీపం మార్చడంలో ఆంతర్యం ఏమిటో? అన్నట్లు బసవేశ్వరునివైపు చూసారు. మొదటి దీపం ప్రభుత్వానిది, రెండవది నా స్వంతానిది అన్నాడు బసవేశ్వరుడు. మతపరమైన చర్చ ధర్మసంబంధంగా నా వ్యక్తిగత విషయం. ఇందుకు ప్రభుత్వం వారి సొమ్ము వాడటం ‘తగదని’ అలా చేసాను అని బదులిచ్చాడు. ఇప్పుడు మంత్రులగా మరేదే ప్రజాదనాన్ని దోచుకోవడానికి అనేవిధంగా తయారైన నేపధ్యంలో ఈ కథ ఒక చురకలాంటింది. 

ఒక వైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ బసవడు భగవద్భక్తి వ్యాప్తికి నిరంతర కృషి చేశాడు. అతని బోధనలలోని సమదృష్టి పలువురిని ఆకర్షించింది. వీరశైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి ఆంధ్రదేశంలోను వ్యాప్తి చెందినది. ప్రతిరోజు లక్షా తొంభై ఆరువేల మంది జంగములకు మృష్టాన్నములతో అర్చించి అనంతరం తాను భుజించేవాడట. బసవడు తన ఉపదేశాలు ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు వ్రాసాడు. వీటిలో సూక్ష్మమైన తత్త్వం సులువుగా బోధపడేది. సాహిత్య పరంగా కూడా బసవేశ్వరుని వచనాలకు చక్కని గౌరవం లభించింది. ఇతడు మొత్తం 64 లక్షల వచనాలు కూర్చినట్లు ప్రతీతి. కానీ, ఈనాడు కొన్ని వేలు మాత్రమే మనకు లభ్యమైనాయి.

బసవేశ్వరుడు స్థాపించిన సంఘ 'అనుభవ మండపం' అని పేరు. బసవేశవరుడు తన చేతుల మీదుగా ఒక వర్ణాంతర వివాహం జరిపాడు. అది ఆనాటి సంఘంలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నూతన దంపదుతులు హత్యకు గురౌతారు. ఈ సంఘటన బసవుని హృదయాన్ని కలచివేస్తుంది. తన అమాత్య పదవిని వదలి బసవేశ్వరుడు కూడలి సంగమేశ్వరుని సన్నిధికి చేరి, కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు.

బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో "లింగాయత ధర్మం"గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాశాడు. వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు. ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటినుంచి పారిపోయాడు.శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు. ఆయన ఉపదేశాలు:

సాహిత్యం పై ప్రభావం

శ్రీ గురు బసవ
బసవేశ్వరుడి ప్రభావం కర్ణాటక ప్రాంతంలో చాలా ఎక్కువ. ఆయన చెప్పిన ‘మాటలు’ వచనాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన ప్రభావంతోనే తెలుగులో పాల్కురికి సోమనాథుడు విశేషమైన రచనలు చేశాడు. తెలుగులో మొట్టమొదటి దేశిపురాణం బసవపురాణం. మొదటి శతకం వృషాధిప శతకం. ఈ రెండూ సోమనాథుడు బసవేశ్వరుని ప్రభావంతో రచించినవే. పాల్కురికి సోమనాథుడు బసవేశ్వరుని రెండవ శంకరుడనెను.
ఘనుడు బసవణ్ణ. శెట్టి అయిన సిరియాళుణ్ణి, రజకుడైన మడివాలు మాచయ్యను, చండాలుడిగా చెప్పే కక్కయ్యను, మాదిగ కులస్థుడైన చెన్నయ్యను, బాలిక అయిన గొడ గూచిని, స్ర్తి అయిన అక్కమహాదేవిని కుల, బాల, స్ర్తి, పురుష బేధం పాటించకుండా శివభక్తి ప్రస్థానంలో మహోన్నత స్థానంలో నిలబెట్టాడు బసవేశ్వరుడు.

సామాజిక స్థితి గతులపై బసవని ప్రభావం

బెంగుళూరులోని గురు బసవన్న విగ్రహం
కులాన్ని త్రోసి రాజని సర్వమానముల చేతిలో చిన్ని లింగాన్ని పెట్టి లింగార్చన చేయమన్నాడు. అప్పట్లోనే కులాంతర వివాహాలు నిర్వహించి కులాలు మానవుడు కల్పించినవే అవి సహజంగా వచ్చినవి కావని చెప్పగలిగిన జ్ఞానం తోపాటు ధైర్యం కలవాడు బసవన్న. శైవమత వ్యాప్తిలోవున్న కాలం కావడం వల్ల కావచ్చు లేదా ఏదో ఒక కేంద్రీకృత లక్ష్యం మనిషికి అవసరమని భావించడం వల్ల కావచ్చు ఆద్యాత్మిక దోరణిని ప్రజలలో వ్యాపింప చేయడం లో ప్రధాన పాత్ర పోషించారు. పరమేశ్వరుణ్ణి ప్రతి మనిషికీ అందేలా చేసి కులాలతోనూ, ఆడా,మగ వ్యత్యాసంతోనూ సంభందంలేకుండా లింగధారణ చేయించాడు. దేవుణ్ణి ప్రతివారి లోనూ వుండేలా చేసినపుడే సమాజనిర్మాణం సక్రమంగా వుంటుందని భావించారు. ఈ లింగార్చన ఒక ధ్యానయోగం. ఈ రోజుల్లో ఎందరో తమ మనస్సు శాంతి, ఏకాగ్రత కొరకు ధ్యానం అభ్యాసం చేస్తున్నారు. కాని బసవణ్ణి ఆ రోజుల్లోనే సహజంగానే ధ్యానం కుదిరే పద్ధతి వ్యాప్తి చేసాడు.
ధనమే ప్రధానం అనుకొనేవాడికి శివుణ్ణి చేరడం సాధ్యంకాదు అంటాడు బసవన్న. వడ్డీ వ్యాపారం మానవుల ఆర్థిక అసమానతలకు కారణం అని ఆనాడే నిరసించాడు. ధనవ్యామోహం దుర్బలమైంది అనేది బసవణ్ణ ప్రగాఢ విశ్వాసం. సత్యమే దైవము మరియు అన్ని ప్రాణుల యెడల దయకు మించిన దైవము మరొకటి లేదంటాడు. బసవేశ్వరుడు అస్పృశ్యతా నివారణ, స్ర్తిగౌరవము పెంపుదల, స్ర్తి సమానత్వము, కుటీర పరిశ్రమల పెంపు, ఆర్దిక సమానత్వం మొదలైన సంస్కరణలు ఆరోజుల్లో అమలుపరచి సత్ఫలితాలను సాధించాడు.

బస వేశ్వరు డికి లభిస్తున్న ఆదరణ ఛాందసవాదుల్లో కంపనాలు రేకెత్తించింది. వారు అతడి పట్ల ఈర్ష్యపడేవారు. అతడికి శత్రువులుగా మారారు. అయినప్పటికీ బసవేశ్వరుని వ్యక్తిత్వం ముందు అవి నిలబడలేదు. క్రీ.శ. 1167లో బసవేశ్వ రుడు తిరిగి కుండల సంగమానికి చేరుకున్నాడు. అక్కడే తన దేహాన్ని చాలించాడు.


శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవ మతానికి బీజాలు వేశాడు. ఆయన ఉపదేశాలు:
Kudala sangama in Bagalkot district,
where Guru Basavanna's samadhi is located.

మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు.

శివుడే సత్యం, నిత్యం.

దేహమే దేవాలయం.

స్త్రీ పురుష భేదంలేదు.

శ్రమను మించిన సౌందర్యంలేదు.

భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.

దొంగలింపకు, హత్యలు చేయకు

కల్లలనాడకు, కోపగింపకు ఆత్మస్తుతి పరనిందల విడువు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణం అంటారు. కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవనానికి గౌరవస్థానం కల్పించిన బసవేశ్వరుడు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు .ఇప్పటికీ బసవన్న జయంతిని ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు జరుపడం అనవాయితీ.

One of his most famous lessons is  -
Original -
ಕಲಬೇಡ ಕೊಲಬೇಡ
ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೆಡ
ಮುನಿಯಬೇಡ, ಅನ್ಯರಿಗೆ ಅಸಹ್ಯ ಪಡಬೇಡ
ತನ್ನ ಬಣ್ಣಿಸ ಬೆಡ, ಇದಿರ ಹಳಿಯಲುಬೇಡ
ಇದೇ ಅಂತರಂಗ ಶುದ್ಧಿ, ಇದೇ ಬಹಿರಂಗಶುದ್ಧಿ
ಇದೇ ನಮ್ಮ ಕೂಡಲಸಂಗಮನೊಲಿಸುವ ಪರಿ
Transliteration -
Kalabeda, Kolabeda, Husiya nudiyalu beda,
Muniyabeda, Anyarige asahya padabeda
Tanna bannisabeda, Idira haliyalubeda
Ide antaranga shuddhi, Ide bahiranga shuddhi
Ide namma koodalasangamanolisuva pari.
Translation -
Don’t steal. Don’t kill. Don’t lie.
Don’t lose your temper. Don’t act with disgust towards anyone.
Don’t praise yourself. Don’t degrade others.
This is  inner cleanliness. This is outer cleanliness*.
This is the means to please our Kudalasangama**.
* Cleanliness in this context refers to the Hindu concept of moral and physical cleanliness. Orthodox upper caste Hindus consider a whole range of actions, deeds, movements, methods and people as ‘unclean’ and go to many ritualistic means to avoid becoming ‘unclean’ through contact of these things. Basavanna is clarifying that such deeds, rather than the ritual actions, make one ‘clean’.
** Kudalasangama was Basavanna’s name for his personal god and he addressed his sayings to this version of god.( ఈయన కూడల సంగమేశ్వరా అనే మకుటంతోనే తన వచన గీతాలన్నీ వెలువరచారు)
భారత పార్లమెంటు లో 2003 ఏప్రియల్ 28 న అప్పటి రాష్ట్రపతి
శ్రీ ఎపిజె అబ్దుల్ కలాం బసవేశ్వరుని విగ్రహం ఆవిష్కరించారు
బసవేశ్వరుని పేరుతో 1997 లో విడుదల చేసిన
పోస్టల్ స్టాంపు
మహాత్మ బసవ అంటూ భారత ప్రభుత్వం విడుదల చేసిన
స్మారక  ఐదు రూపాయిల నాణెం 







మరింత సమాచారం కోసం

1) బసవని జీవిత చరిత్ర, వారి రచనలు, వాక్కులూ వంటి వివరాలు ఆంగ్లలో చదవదలుచుకుంటే
http://www.vishwagurubasavanna.com/Default.aspx
2) దీవి సుబ్బారావు గారు అనువాదం చేసిన బసవని వచనాలు కొన్ని
‘‘ మాటన్నది జ్యోతిర్లింగం ’’ పుస్తకంలో దొరుకుతాయి



.

కామెంట్‌లు

  1. కానీ బసవన్న మతవాది, మతగురువు కూడా ! వేమన అచలవేదాంతి అయినా మతవాది కాడు. అందుచేత బసవణ్ణ సామాజిక చింతనకి చాలా పరిమితులున్నాయి. వేమనకి అవి లేవు. కనుక వేమనతో బసవన్న తులతూగడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శివకవులకు నవ కవులకు
      శివ భక్తికి, తత్వమునకు, చింతామణికిన్
      శివలోక ప్రమథులకును
      శివనకు, గురునకు శరణు సేయర వేమా.

      వేమన రచించిన తొలి ప్రార్థనా పద్యం ఇది. ఇంకా శివుని, శివమతాన్ని కీర్తిస్తూ చాలా పద్యాలే రాశాడు. బసవన్నని వేమనతో పొల్చటంలో తప్పేమీ లేదు. ఇద్దరూ సామాజిక దురాచారాలను ఖండించిన వారే. అంతేకాదు బసవని గాథను కీర్తిస్తూ ఇలా అన్నాడు:

      రామాయణము జూడ రాక్షస హరణంబు
      భారతంబు జూడ బంధు నాశనము
      బసవపురాణము జూడ భక్తి మార్గంబురా
      విశ్వదాభిరామ వినర వేమా.

      తొలగించండి
  2. ఇటువంటి గొప్పవారి సాహిత్యం గురించి ఉస్మానియాలో కన్నడ విభాగంలో జరిగిన ఒక సదస్సులో పాల్గొని కొన్ని విషయాలు తెలుసుకోగలిగినాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి