మరో శివాజీ సర్ధార్ సర్వాయి పాపన్న

సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా జనగాం దగ్గర కైలాస్ పూర్ గ్రామంలో గౌడ కులంలో  ఆగష్టు 18, 1650  లో జన్మించారు, తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవారు.పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు, తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు, కాని అతని మనసులో మాత్రం తెలంగాణా లో అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని ఉండేది, అందుకోసం అతను గెరిల్ల సైన్యాన్ని తాయారు చేసాడు, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసే వాడు,1675 లో సర్వాయి పేట లో తన రాజ్యాన్ని స్థాపించాడు, తన సొంత ఊరు కైలాస్ పూర్ రాజధాని.
ఇతను శివాజీకి సమకాలికుడు, శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడాడు, 1687 - 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు, పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు, 1678 వరకు తాటికొండ, వేములకొందాలను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు, 1700 - 1705 మధ్య కలం లో షా పుర లో మరొక దుర్గం నిర్మించాడు, అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీం నగర్ జిల్లా లోని హుసనాబాద్, హుజురా బాద్ విస్తరించింది, భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.




పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు, అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు, ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు, పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు, అతని రాజ్యం లో సామజిక న్యాయం పాటించేవాడు, తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు, అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు, అది నేటికి రూపం మారిన అలానే ఉంది.

పాపన్న గెరిల్ల సైన్యం తో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబ్ కు తెలిసింది, అతడు రుస్తుం దిల్ ఖాన్ కు భాద్యతలు అప్పగించాడు, రుస్తుం దిల్ ఖాన్ యుద్దానికి ఖాసిం ఖాన్ ను పంపించాడు, శఃపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి, నెలలపాటు యుద్ధం జరిగింది, చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు, సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది, పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు, దాంతో ఆయన యుద్దాన్ని విరమించుకున్నాడు, అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి, అయితే పాపన్న తన సొంత ఊరు జనగామ కు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు, ఔరంగజేబ్ మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1 ఏప్రిల్ 1708 లో వరంగల్ కోటపై దాడి చేసాడు, అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు.


1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వెల్లడ దీసారు.ఆదిలాబాదు జిల్లా నిర్మల్ లో జూలై 30, 2012 నాడు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టించబడింది.ఆగష్టు 18, 2012 నాడుకరీంనగర్ జిల్లా సర్వాయిపేట గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహం కరీంనగర్ లోకసభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చే ఆవిష్కరించబడింది.

కామెంట్‌లు