తెలుగు అక్షరానికి రూపు నిచ్చిన ఎరికల్‌ ముత్తురాజు చోళ ధనంజయుడు

చోళపాలకులు ఒక దృఢమైన చారిత్రక నిర్ణయాన్ని తీసుకొన్నారు. నాగరికంగా, రాజకీయంగా బలవంతులైన వారి భాషను స్వీకరించే సాధారణ సంప్రదాయాన్ని తిరస్కరించి, తమ తెగ భాషైన తెలుగుని తమ ప్రభుత్వ అధికారభాషగా చేసారు. తమ శాసనాలలో తొలిసారి తెలుగు అక్షరానికి రూపం కల్పించిన తెలుగు మహారాజు ఎరికల్‌ ముత్తురాజు చోళధనుంజయుడు.


వేట్టువర్‌ లేక వేడర్‌లు 'కొట్టం' అంటే కోట గోడలు కలిగిన గ్రామం లేక ప్రాంతం అధిపతులని ప్రాచీన కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ గ్రామాధిపతి హోదాని 'ముతుద' అంటారు. 'ముతుద'అంటే తెలుగులో ఊరికాపు లేక గ్రామ రక్షకుడు. నాయ కుడనే అర్థాలున్నాయి. కనుక గ్రామాలను నిర్మించి ఆయుధాన్ని చేపట్టి ప్రజారక్షణ వృత్తిని స్వీకరించిన తొలి సమూహం వేట్టువర్‌లు లేక వేడర్లని తెలుస్తుంది.


ఈ గ్రామాధిపతి హోదా తరతరాలుగా వస్తూ ఉండేది. ఈ అధికారి నేర విచారణ చేయడం శాంతి భద్రతలు కాపాడడం పన్నులు వసూలు చేయడం వంటి బాధ్యతలు కలిగి ఉండేవాడు. ఈ వేట్టువరల మూలాలు పరిశీలించినట్లైతే స్వర్ణముఖీనదీ తీరంలోని అడవుల్లో ఉన్న


'కన్నప్ప' సంతతికి చెందినవారని తమిళ స్కందపురాణం లోనూ, కొంగుమండలవలారులోను చెప్పబడింది. ఈ వేట్టువర్‌లను చేరరాజు కొంగునాడుకి తీసుకొని పోయినట్లు కూడ చెప్పబడింది. వేట్టువర్లలోని ఒకశాఖ తమిళనాడులోని తిరుచానపల్లి, తంజావూరు, కొడంబలూరు ప్రాంతాలను పరిపాలించారు. మరొక శాఖ ఆంధ్రప్రాంతంలోని నేటి రాయల సీమ ప్రాంతమైన కడప మండలాన్ని పరిపాలించారు.


రేనాడు ఏడు వేల దేశము అనగా ఏడు వేల గ్రామాలున్న దేశాన్ని పాలించిన వారమని వారి శాసనాలలలో చెప్పుకొనుట వల్ల వారిని చరిత్ర కారులు రేనాటి చోళులని వ్యవహరించారు.


కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో రేనాడుని ప్రస్తావించే శాసనాలు లభించాయని రేనాడు ఎఱువేలసీమగా శాసనాలలో పేర్కొనబడినట్లు ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళంలో కుందూరు ఈశ్వరదత్తు వివరించారు. రేనాటి చోళులు తాము కరి కాల చోళుని వంశస్థులమని వారి శాసనా లలో చెప్పుకొన్నారు. రేనాడు చోళ వంశస్థాపకుడు నంది వర్మ ఈ రాజవంశీయులకు కమలా పురం తాలుకాలోని పెదచెప్పలి రాజధాని ఈ రేనాడు చోళరాజ్యం పల్లవ, చాళుక్యరాజ్యాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున పల్లవ చాళుక్యరాజుల మధ్య జరిగిన దీర్ఘ కాలిక యుద్ధాలలో రాయల సీమ లోని చాల ప్రాంతాలు ఆర్థికం గా సామాజికంగాచితికిపోయాయి. ఆటవిక జీవనాన్ని వదలి వేట్టు వర్‌లు పరిపాలకులుగా ఎదిగిన తొలినాళ్లలో తమిళులైన కంచి


పల్లవులకు కన్నడిగులైన చాళుక్యు లకు భిన్నంగా తమకొక అస్థిత్వాన్ని సాధించుకొనే ప్రయత్నంలో వారి కొక భాషకావలసివచ్చింది. తక్కవ సాంప్రదాయానికి చెందిన తెగ ప్రజలు వారి స్థానిక భాష మాత్రమే తెలిసి ఉన్నత సంప్రదాయ భాష తెలియకపోతే వారికి సామాజిక ఊర్ధ్వ చలనం దాదాపు అసాధ్యమ య్యేది. కనుక ఆనాటి కాలంలో నాగరిక రాజకీయ వర్గాలలో బలవంతులైన వారి భాషను స్వీకరించే సాధారణ సంప్రదాయం తక్కువ వర్ణాల లేక వర్గాల వారు స్వీకిరంచేవారు.


అలా ఉన్నత సంప్రదాయ భాష సంస్కృత, సంస్కృతితో పరిచయం లేని చోళ రాజులు (వేట్టువర్‌లు) అభివృద్ధిలో ముందున్న కృష్ణా, గోదావరి, పరివాహక ప్రాంతాల నుండి దిగుమతి చేసుకొనే ప్రయత్నాలు చేసారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. సుఖమయ అగ్రహారాలను వదలి బ్రాహ్మణ పండితులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న రాయల సీమ ప్రాంతానికి వచ్చి స్థిర పడేందుకు ఇష్టపడలేదని చెప్ప వచ్చు. ఆ తరువాత మధ్యప్రదేశ్‌లోని రేవా, చేది ప్రాంతాల నుండి బ్రాహ్మణు లను ఆహ్వానించివారికి బూదానాలను ఇచ్చినట్లు చోళరాజుల దాన శాసనాల లోని రేవా శర్మ చేతిశర్మ వంటి పేర్లను బట్టి తెలుస్తుంది.


అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. అపుడు చోళ పాలకులు ఒక ధృడమైన చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొన్నారు. నాగరికంగా , రాజకీయంగా బలవంతు లన వారి భాషను స్వీకరించే సాధారణ సంప్ర దాయాన్ని తిరస్కరించి, తమ తెగ భాషైన తెలుగుని తమ ప్రభుత్వ అధికారభాషగా చేసారు. తమ శాసనాలలో తొలిసారి తెలుగు అక్షరానికి రూపం కల్పించిన తెలుగు మహారాజు ఎరికల్‌ ముత్తురాజు చోళ ధనుంజయుడు.


ఇతడు రేనాడుని పరిపాలిస్తూ కడపజిల్లా కమలాపురం తాలూకా కలమళ్ల గ్రామం లోని చెన్నకేశవ దేవాలయంలో వేయిం చిన క్రీ.శ. 575 నాటి శాసనం ఇప్పటి వరకు లభించిన శాసనాలలో తొలి తెలుగు శాస నంగా గుర్తించబడింది.


(రాలయసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ- వల్లం పాటి వెంకటసుబ్బయ్య) చోళధనుంజయ మహారాజు శిలాశాసనాలపై వెలిగించిన తెలుగు అక్షర జ్యోతులు ప్రకాశవంతమై తరువాతి రాజ వంశాలకు మార్గాలను చూపాయి. రేనాడు రాజులు దాన శాసనా లన్నీ తెలుగులోనే వేయించారు. ఈ చోళ రాజులు 'ఎరికన్‌' లేక 'ఎరిగల్‌' 'ముత్తురాజు' ల మని వారి శాసనాలలో చెప్పుకొన్నారు. ఎరియు అంటే మండు, కాలు, అనే అర్థాలున్నాయి. కనుక మండే గుణం కాలేగుణం నిప్పు కుంది. కనుక 'ఎరి' అంటే 'నిప్పు' 'కల్‌' అంటే రాయి అని అర్థం కనుక 'ఎరికల్‌' అంటే నిప్పురాయి అని అర్థం పాతరోజుల్లో ఆకాశం నుండి ఉరుములు వచ్చినపుడు నిప్పురాయి పడుతుందనే నమ్మకం ఉండేది. కనుకనే చోళమండలంలో నేటికి పిడుగుకి పర్యాయపదం 'ఎరికల్‌' అంటారు. ఈ చోళ వంశస్థులు పగాపిడుగు, మార్పిడుగు ముదిమఱున్ఱ పడుగు, మఱున్ఱపిడుగు అగ్రాణిపిడుగు వంటి బిరుధులు ధరించారు. ఎరికల్‌ ముత్తురాజు ధనుంజయుని కుమారుడు మహేంధ్ర విక్రమవర్మకి పరిప్రతాప లేక వీరప్రతాప చోళుడనే పేరు ఉంది.


ఇతడు వ్యాకరణం మొదలగు శాస్త్రాలలో పండితుడు అంతేకాక పాండ్య చోళ కేరళానామాధిపతి ముదిత శిలాక్షర నవరామ వంటి బిరుదులు కల వాడు అయితే పండితుల క్రీ.శ. 7.8 శతాబ్దాల నాటి శాసనాల వల్ల


బృహత్‌ పల్లవ సామ్రాజ్యాధినేత సింహవిష్ణువు కళభ్రులపై దండయాత్ర చేసి జయించి తన సామంత పాలకుడైన మహేంధ్ర విక్రమమర్మకు ఆ ప్రాంతాల మీద పాలనా, నిర్వాహణ బాధ్యత అప్పగించబడినందున ఆ బిరుదు ధరించి ఉండవచ్చు. అంతేకాని ఒక సామంతరాజు దక్షిణ భారత దేశాన్నంతా జయించడానికి తగిన సైనిక బలం అతనికి లేదని ఒకవేళ ఉన్నా తన ప్రభువు అనుమతి లేకుండా దండయాత్ర చేయడం వీలుకాదని నిర్జీవమైన పొంతన లేని ప్రతిపాదనలు చేసారు.


పల్లవ చక్రవర్తుల బిరుదులు చోళరాజులు ధరించారనడం అంగీకారయోగ్యమే కానీ పల్లవ చక్రవర్తి తన విజయానికి చిహ్నంగా ధరించవలసిన చోళ- పాండ్య -కేరళా నామాధిపతి బిరుదాన్ని కేవలం మూడు రాజ్యాల యాజమాన్య బాధ్యతలు చేపట్టినటువంటి మహేంద్ర విక్రముడు ధరించాడనడంలో అర్థం లేదు. మహేంద్ర విక్రముడు ధరించిన చోళ- పాండ్య -కేరళానామాధిపతి, ముదితశిలాక్షర 'నవరామ' వంటి బిరుదులు అతనివంశ మూలాలను అతని గుణగణాలను తెలియ జేసేవని పురావస్తు, శాసన వాంజ్ఞయ ఆధారాలవల్ల తెలుస్తుంది. దక్షిణ భారత ద్వీపకల్పంలోని అన్ని మెట్ట ప్రాంతాలలో బయటపడిన మెగాలితిక్‌ సమాధులు, అశోకుని శాసనంలో ప్రస్తావించబడిన మౌర్య సామ్రాజ్యానికి సరిహద్దున దక్షిణాపధంలో ఉన్న స్వతంత్ర రాజ్యాలు పాండ్య-చోళ-చేర (కేరళ పుత్ర) రాజ్యాలయొక్క ప్రారంభ దశలోని ఖణన సంస్కారానికి నిదర్శ నాలే మెగాలితిక్‌ సమాధులు, మెగాలితిక్‌ సంస్కృతికి చెందిన (దక్షిణా పద స్వతంత్ర రాజ్యాలకు చెందిన ప్రజలు) ప్రాథ మిక దశలో వేటగాళ్లగా, చేపలు పట్టేవారిగా జీవించారని సామాజిక పరిణామాలలోని అనేకదశల్ని సంఘ సాహిత్యం సూచిస్తుంది.


మహా భారతంలో దుష్యం తుని సంతతికి చెందిన ఒక శాఖ పాండ్య- చోళ- చేర రాజ్యాలను స్థాపించి నట్లు చెప్పబడింది. వేడర్లకుల పురాణం అర్జునుడికి ఉలూచికి


పుట్టిన సంతానంగా చెప్పుకొంటారు. కన్నప్ప పూర్వజన్మలో అర్జునుడనే కథ అందరికి విధితమే. తమిళనాడులోని తిరుచానపల్లి, తంజావూరు, కొడంబలూరు ప్రాంతాలను పరిపాలించిన చోళముత్తరాయర్లు కొందరు వారిశాసనాలలో 'కన్నప్ప' వంశస్థులమని చెప్పుకొన్నారు. పెరుంబిడుగు, పగాపిడుగు, మార్పిడుగు, విడేల్‌ పిడుగు వంటి బిరుదులు, రేనాడు చోళులకు, తమిళనాడు చోళులకు మధ్యగల సోదరభావాన్ని తెలియజేస్తున్నాయి. ముత్తురాయర్ల బిరుదులలోని శేరు మారన్‌, వెల్‌ మారన్‌, శత్తానీమారన్‌ వంటి మాటలు చేరరాజులను గుర్తు చేస్తున్నాయి.


ఈ ఆధారాలను బట్టి పాండ్య - చోళ - చేర రాజ్యాలను బోయలేక ముత్తరాజులని స్పష్టమౌతుంది. ద్రావిడ భాష మూలాన్ని బట్టి ముత్తు అంటే పురాతన, పాత అనే అర్థాలున్నాయి. కనుక బోయలు తమ శాసనాలలో ముత్తరాజులమని చెప్పు కొన్నారు. ముత్తరాజుకి పర్యాయపదం 'పాలెగాల్‌' ఆంధ్ర, రాయలసీమ ప్రాంతా లలో ముత్తరాసి, తలారి, వాల్మీకి, బోయ వంటి వివిధ పేర్లతో పిలువ బడుతున్నారు. తెలంగాణ ప్రాంతాలలో ద్రావిడ 'న' కారాన్ని జాతి పేరులో నిలుపుకొని 'తెనుగోళ్ల'మని చెప్పుకోవడాన్ని బట్టి వారు ఎంతటి తెలుగు మూలవాసులో అర్థమౌతుంది.


భీమనాధుని శ్రీనివాస్‌

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి