లెక్కలేని పద్యం

నిండుగా నవ్వేందుకూ, తనివితీరా ఏడ్చేందుకూ
భాషానియమాలెందుకు మిత్రమా?
మనసారా బ్రతికేందుకూ, కరువుతీరా దాహంతీరేందుకూ
కొలబద్దలెక్కడ దొరుకుతాయి చిత్రంగా?
అంతా లెక్కల్లోనేనన్న తొలి సూత్రానికే గండిపడ్డట్లు,
లెక్కలేకుండా తిరగడానికీ కొలతల దారం చుట్టుకున్నట్లుంది.
మొత్తంగా నే చెప్పొచ్చేదేంటంటే...
వ్యాకరణం రాసాక భాషఏర్పడలేదు.
భాష ఉపయోగంలోకొచ్చాకే వ్యాకరణం రాసారని.
చీకటిని తోలేందుకే దీపం వెలిగిస్తారు కానీ
వెలుతుర్ని దాచేందుకు చీకటిని తేలేరని
అద్సరే కానీ ఒకసారలా ఉత్తినే వుండు
కవిత రాసాక శీర్షిక పెట్టానా?
శీర్షిక తోచాకే కవిత రాసానా నేనోసారి వెతుక్కోవాలిప్పుడు.
05-07-2015 11:48PM

కామెంట్‌లు