చిందు యక్షగానం

ఐనవోలుకు ముందు ఖమ్మం దారిలో వరంగల్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వర్ధన్నపేట మండలానికి చెందిన పున్నేలు గ్రామంలో శాసనమే దేవుడిగా పూజలందుకుంటున్నగుడిని చూసొద్దామని వెళితే వెతకబోయిన తీగ కాళ్ళకు అడ్డం పడినట్లు కళ్ళకెదురుగా చిందు యక్షగానంలోని కంసవధ ఘట్టం బయలాట ప్రదర్శింపబడుతోంది.





చిందోళ్ళెవరు ?
సిందోళ్ళు , చిందోళ్ళు ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లో 59 వ కులం.వశిష్టుడి తల్లి ఊర్వశి(వేశ్య), భార్య అరుంధతి (మాదిగ).జాంబవంతునికి రక్త సంబంధికురాలు. అరుంధతికి, వశిష్టుడికి పుట్టిన ప్రథమ సంతానమే శక్తి. ఈ శక్తి సంతానమైన చిందులు యాచకులుగా జీవిస్తున్నారు. ప్రత్యేక భాష, సంస్కృతి, ఆచారాలు కలిగి ఉన్న చిందులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు.వీరు దక్కలి, మాస్టి, గంగిరెద్దుల, దాసరి, బుడిగ జంగాలు, బాలసంతు,గోత్రాల, పూసవేర్ల తదితర కులాలలోకి చెదిరిపోయి కొన్ని కులాలు ఎస్సీలుగా, మరికొన్ని కులాలు బీసీలుగా ఉన్నారు.
జాంబవంతుడు తొలుత జంతు చర్మంతో దుస్తులు, చెప్పులు చేశాడు. ఇనుమును కరిగించడం కోసం తోలుతిత్తిని కనుగొన్నాడు.తోలుతో డప్పు తయారు చేశాడు.ఆయన కనుగొన్న ఉత్పత్తి పరికరాలు సమాజానికి ఎలా ఉపయోగపడ్డాయో తెలియచేశారు చిందు కళాకారులు.తోలుతో మద్దెల, కంచులతో తాళం, హార్మోనియం సంగీత పరికరాల తయారీతో చిందు అనే సాంస్కతిక కళారూపానికి మెరుగులు దిద్దారు.
. వైష్ణవుల, శైవుల పాలనలో నర్తకులుగా జీవిస్తూ చిందు కళాకారులు దేవతలను, చక్రవర్తులను, రాజుల చరిత్రలను తమ ఆట, పాట, మాటలతో యక్షగాన ప్రదర్శనలతో ప్రచారంచేశారు. గోత్రము గంగాధరి, మునివంశం, బొట్టు పంగనామాలు (వైష్ణవనామం) వంటివే కాకుండా శరీరానికి జంజరము కూడా ధరిస్తారు. మరణానంతరం భూమిలో పాతిపెట్టే ఆచారం ఉంది. నేటి చిందులు మాదిగలపై ఆధారపడి వారికి యాచకులై జీవిస్తున్నారు.మాదిగ సమూహంలోనే ఉంటారు.మాదిగలతో కంచం పొత్తు ఉన్నా,మంచం పొత్తు(పెండ్లి సం బంధాలు) ఉండదు.
యక్షగానం ఏమిటి?
యక్షగానం కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ కరావళి జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలోనూ శివమొగ్గ మరియు కేరళ లోని కాసరగోడు జిల్లాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. అయితే తెలుగు ప్రాంతం నుంచిే కర్ణాటకు ఈ యక్షగానం వలస వెళ్ళిందనే వాదన కూడా ఒకటుంది. పూర్వం తెలుగు నాడును యక్షభూమి అని పిలిచేవారు. యక్షులనే గంధర్వ జాతికి చెందిన వారు., ఆడి పాడిన, భూమి కనుక వారి నృత్య శైలే యక్షగానంగా వర్థిల్లిందంటారు. యక్షగానం వ్యుత్పత్తి ప్రకారం ఒక యక్షుడి పాట(గానం). ఇక్కడ యక్షుడంటే ప్రాచీన భారతదేశంలో నివసించే అడివిజాతి మనిషి అని అర్థం వస్తుంది. యక్షగానంలో నేపథ్యంలో హిమ్మెళ(హిందె+మేళ) నేపథ్య సంగీత సమూహం ఇంకా ముమ్మెళ(ముందె+మేళ) నృత్య మరియు సంభాషణ గుంపు ఉంటాయి. ఈ రెండు గుంపుల సమన్వయమే యక్షగానం. హిమ్మెళ లో ఒక భాగవత గాయకుడు(ఇతనే దర్శకుడు-ఇతనినే మొదలనె వేష(మొదటి వేషగాడు) అంటారు), మద్దెల వారు, హార్మోనియం (ముందులో హార్మోనియం స్థానంలో పుంగి అనే వాయిద్యాన్ని వాడేవారు) వాయించే వ్యక్తి, ఇంకా చండె(పెద్ద ధ్వని చేసే డప్పులు) వాయించేవారు ఉంటారు. సంగీతం మట్టు మరియు యక్షగాన తాళాలతో రంగరించిన కర్ణాటక సాంప్రదాయ రాగాలపై ఆధారపడి ఉంటుంది. యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు, పద్ధతులు ఉన్నప్పటికి, బయలాట(వీధిభాగోతం)అత్యంత జనప్రియ మైనది. బయలాట అనగా వస్త్రాలంకరణ, వేషాలంకరణ కావించుకొని వేదిక భూమిపై ఆడే ప్రదర్శన ఇది. తాళమద్దలె అనునది యక్షగానంలో మరొక ప్రదర్శనరీతి, విధానం. ఇది బయలాటకన్న విభిన్నమైనది. ఈపద్ధతిలో వస్త్రాలంకరణ, నృత్యం మరియు భావవ్యక్తీకరణ కనిపించవు. నేపథ్యం, భాగవతారు, మరియు ప్రాసంగికులు(మాటకారులు)మాత్రమే ఉంటారు. ఇందులో భాగవతారు మూలకథను పాటరూపంలో పాడగా, అర్థధారులు (కథాంశమును వచనంలో వివరించువారు)పాటలోని కథాంశమును, ప్రాసంగికులతో మాట్లాడంద్వారా ప్రేక్షకులకు వివరించెదరు. బయలాటలో నృత్య, అభినయాలు ముఖ్యాంశాలు. ఇందులో సంభాషణలకు ప్రాధాన్యతను ఇస్తారు. బయలాటలో వచనమునకు పరిమితి ఉన్నది. తాళమద్దలె లో లేదు. తాళమద్దలె లో వచనమే ప్రాధాన్యం.

కామెంట్‌లు