అ.రె.చకం 2 : దాన్నేనా మీరు ప్రేమంటున్నారు?




ముందోకమాట చెప్పాలి ఈ మధ్య వరుగా ఒకే సినిమా గురించి మాట్లాడవలసి వస్తోంది. విజయ్ దేవరకొండమీదకానీ దర్శకనిర్మాతలమీద కానీ ప్రత్యేకమైన వ్యతిరేఖత లేదు కేవలం సినిమా బాగాలేకపోవటమే కాక దాని తదనంతర పరిణామాలుపై నాకున్న అంచనా ప్రమాదకరంగా అనిపించడం వల్లనే. మొదట్లో దీనికి వ్యతిరేఖంగా రాస్తున్నప్పుడు నేను ఒక్కడ్నే ఇలా మాట్లాడుతున్నానా అన్న అనుమానం భయం కూడా కలిగాయి. కానీ ఇప్పుడు మోరల్ గా వస్తున్న సపోర్ట్ చూస్తేసమాజం మీద ఇంకా నమ్మకం నిలబెట్టుకోవచ్చు అనిపించింది. నాకంటే ఎన్నోరెట్లు చాలా సూటిగా, ఆధారసహితంగా చాలామంది మిత్రులు దీన్ని విశ్లేషించారు. ఇంకొన్ని మాటలు అలాగే మిగిలి పోయాయి. వీలువెంబడి ఒక్కొక్కదానిపై నా అభిప్రాయం చెప్తాను. దీన్ని కేవలం వ్యతిరేఖించాలని ‘బేస్’ లేకుండా చేసే కామెంట్లను దయచేసి ఇక్కడ పెట్టకండీ. ఇది నా అభిప్రాయం మాత్రమే.
అర్జున్ రెడ్డి వి తాగుడు, మత్తుమందులు తీసుకోవడం, అతికోపం, విచక్షణ లేకపోవడం అన్ని చెడ్డవి సరే అతని ప్రేమ గొప్పది తెలుసా? మాకు ఆ విషయం నచ్చింది అంటూ చాలా మంది మిత్రులు అంటూ వస్తున్నారు. ఆకాశమంత ప్రేమ అని అన్ లిమిటెడ్ లవ్ అని దీన్ని వర్ణిస్తూ వచ్చారు. బహుశా వారి వారి జీవితాల్లో వున్న ప్రేమను తల్సుకుని దాన్ని అ.రె.చకంలో సంఘటను గమనించి అంత గొప్పది అనుకుంటున్నారేమో కానీ అసలు అతను నిజంగా ప్రేమను చూపించింది ఎక్కడ? నేను మిస్సయిన చోట్లు వుంటే తప్పకుండా చెప్పండి అర్ధం చేసుకుంటాను. అలాగే ఇది సినిమా అని అ.రె.చకం కేవలం పాత్ర అనే కోణంలోనే నేనూ స్క్రిప్టు గురించే మాట్లాడుతున్నా లేకుండా వెంటనే పోలీసులూ, సైకాలజిస్టులు మాట్లాడేవారేమో.
1)       చూడంగానే ప్రేమ నిజమే అయితే  వ్యక్తం చేసిన పద్దతి అదా? లాండు కబ్జా చేసే విలన్ల పద్దతిని అనుసరిస్తే బావుంటుంది అనుకున్నారా డైరెక్టరు గారూ. అరే ఎలాగైనా ఈ లాండ్ ని కబ్జా చేసెయ్యాలి. కంపెనీని మనం మాత్రమే టేకోవర్ చేయాలి. దానికోసం మనకున్న బలం పరపతి వాడాలి. మన మనసుని చూపించాలి లాంటి పాతకాలం ఆలోచనలతో పనేమిటి. ’అది‘ మనకి కావాలి అంతే, మనం వాళ్లకు కావాలి అనే ప్రశ్నే మన బుర్రలోకి రాదు రాకూడదు.
2)      పాఠం చెప్పాడు బట్టలు ఉతికాడు హెంత గ్రేటో అనే ఆశ్చర్యం కొందరు భలే వ్యక్తం చేసారు కానీ తరగతులను ఎగ్గొట్టించి ఎక్కడో ఒంటరి ప్రదేశాలకు తీసుకుపోయి ఒళ్ళు పామటం భలే ప్రేమ కదా. అదికూడా అరచేయి ఆపైన దండచేయి, ఆపైన భుజం..  ఆ పైన ఇంకేముంది మొత్తం ఇంటికే తీసుకు పోవడం. కుక్కని పెంచుకున్నప్పుడే దాని నోట్లో వేలుపెట్టటం, దానికి తినిపిస్తూ అదే తనూ తినటం చేసిన డాక్టరు గారికి ఒక వస్తువుని తనతో వుంచుకున్నపుడు తన అవసరాలు తనకు అవకాశం వున్నంతలో చేసిపెట్టటం ఇక్కడొక్కచోటే కనిపించింది. ‘ఆ....’ తర్వాత ఆమె పనులు చేసినట్లు కానీ చేయాల్సిన అవసరం వచ్చినట్లుకానీ కనిపించకపోవటం మంచి స్క్రీన్ ప్లేనే కదా.
3)      కాలేజి నుంచి బయటికి వెళ్లిన తర్వాత రాగింగ్ జరగొద్దని నానా యాగీ చేయగలడు పైటింగులూ చేస్తాడు, ఓడినవాడిని బ్రతిమిలాడుకుంటాడు గొప్పకదా అనుకునే వాళ్ళకు వాళ్ల ఇంటికెళ్లి మూతి xxx , వాళ్ల నాన్న బిపి పెంచి హైరానా పెట్టిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి గురించి ఆలోచించటం చేతకాలేదా? అసలు అమ్మాయిని శారీరకంగా వాడుకున్న తర్వాతనైనా రెండువైపుల కుటుంబాల గురించి ఆలోచించాలి అనిపించదా? వాళ్ళకి ఏదో సందర్భంలో చెప్పాలన్న స్పృహ సంవత్సరాలు గడిచిన దాకా రాదా? శరీరం లేదా స్పూత్ గా చెప్పాలని మీరు భావిస్తే అతి స్నేహం లేదా ప్రైవేట్ స్పేస్  కావాలన్నప్పుడు వున్న ఆతృత సహచరి గా చేసుకోవలనుకున్నప్పుడు లేదా?
4)      అంతా సూటి మనిషి అనే బిరుదు భలే యిస్తారు కానీ ఎన్ని డ్యుయాలిటీలో ఈ పాత్రలో కనీసం పెళ్లికుదుర్చుకోవటం లాంటి ముఖ్యమైన పనిమీద వెళ్లికూడా అన్ కంట్రోల్ గా ఏదో చేసి అదేమిటో తండ్రికి సైతం చెప్పలేక ప్రైవేట్ స్పేస్ ప్రైవేట్ స్పేస్ అంటూ దాటవేసిన గొప్ప సూటిమనిషి. ఈ పాత్రని ఎలివేట్ చెయ్యడానికి ఎంత డ్రామా అంటే ఎయిర్ హోస్టెస్ ని కామెంట్ చేసిన వాడితో నీతిసూత్రాలు చెప్పించడం, తను ఇష్టంమైన వైద్య వృత్తిని అవమానిస్తూ పేషెంట్ గా వచ్చిన ఆడవాళ్లునో, పరిచయం అయిన హీరోయిన్ నో ఫిజికల్ గా కోరుకోవడం. స్నేహితురాలితో తట్టుకోలేనంత ఉద్రేకపు ప్రవర్తన. ఇదంతా ఆయనగారి ప్రేమ స్వరూపానికి చిహ్నాలుగానే చూపించారు అనాలా?
5)      అవుటాఫ్ లవ్వా ఆవకాయ బద్దా బుద్దుందేరా బడుద్దాయ్ దాని బతుకేమయిపోద్దో ఆలోచనే వుండదా? ఇంటర్ పూర్తయి మెడిసిన్ చేరిన అమ్మాయంటే బహుశా 18 నడుస్తుంటే ఇంకా మైనరే. సరే ఒకవేళ నిండికూడా ఉండొచ్చు అనుకుందాం. తొలిసారి మాట్లాడేప్పుడు అందరిముందు ముద్దుపెట్టేస్తే, ఆమె ఏమనుకుంటుంది. అనేది అనవసరం ఈయనకు, వ్యక్తిత్వంతో స్పందించటం రాని పాత్ర ఆమెది అయిపోయింది. అయినా ప్రేమ. కనీస జాగ్రత్త సైతం తీసుకోకుండా ప్రెగ్నెంట్ ని చేసే డాక్టరుకి తను చస్తే ఆమె ఎఫెక్ట్ అవుతుంది అనేంత సోయి కూడా లేకపోవడం ప్రేమ.
6)      వళ్లో పడుకోవడం అంటే తన అనుమతితోనూ, తన రిస్కు ఫ్యాక్టర్స్ తోనూ సంభందం లేకుండా దున్నపోతులా పడుకుండి పోవడమే ప్రేమా లేకపోతే దురాక్రమణా సామీ. ట్రావెల్ బ్యాగ్ స్ట్రాప్ వత్తుకు పోయిన విషయాన్ని పట్టించుకున్నది నిజమైతే కాలు నొస్తుందేమో కూడా తెలియదు సరే. ఆరు గంటలని వదిలేసి వస్తే ఎంతబాధపడుతుందో అసలు తెలియదు. ఇవి బ్యాగ్ నొప్పికంటే చిన్నవా.
7)      అవతల నాన్నతాలూకూ జన్యూన్ బాధని సైతం పక్కన పెట్టి, సోదరుడిని ‘మిధున్ బిహేవ్’ అంటూ పక్కకు పెట్టి ఒక్కమాట విను బేబీ అంటూ పబ్లిక్ గా తన స్వంత బజార్లో జనాలు ఇంట్లోవాళ్ళు ఏమనుకుంటారో అనే బెరుకు లేకుండా అతడి హర్డ్ ని విలువ నిచ్చి వెంటపడి బ్రతిమిలాడుతుంటే పశువులా తోసుకుపోతూ ఆరు గంటల సమయం ఇవ్వడం చాలా గొప్ప లవ్ అనేది మీరే నిర్వచనాల్లోంచి చూసారో కదా.
8)      చావుతప్పి బతికిపోగానే ఆ అమ్మయికి పెళ్ళయిందని తెలిసిన తర్వాత వెనకాముందూ చూడకుండా దూసుకెళ్ళి నానా యాగీ చేయటం వచ్చుకానీ, ఆ తర్వాత తనేమయిపోయిందో ఒక్కముక్క కూడా దృష్టికి రాదు ఎందుకంటే కనబడ్డ ఆడవాళ్లని సవరిస్తూ స్క్రిప్టు ప్రకారం అయితే కాసనోవా శిఖరం అంచుదాకా మాత్రమే తోసుకెళ్ళి పడేయకుండా సెల్పీలు తీసుకుని ముచ్చట్లు చెప్పుకోవడం. వాళ్ళు తీసుకొచ్చిన పిండివంటలు తినడం లాంటివి చేస్తూ బిజీగావున్నాడు కదా. ఇకా ఈమెవైపు ఆలోచించటం ఎలా సాద్యం అవుతుంది.

9)       నాలో నీకేం నచ్చింది అంటే ద వే యూ బ్రీద్ అనేది నీ గొప్ప ప్రాక్టికల్ సమాధానం బహుశా అందుకేనేమో గాలికూడా పీల్చుకోనివ్వకుండా ఏడుస్తూ ప్రెగ్నెన్సీ పిరియడ్ మొత్తం గడిపే వరం ఇచ్చావు.



కామెంట్‌లు