నాన్నమాటకు ఆంగ్లానువాదం - సివి సురేష్

కట్టా శ్రీనివాస్ గారి కవిత “నాన్న మాట” ఈ వారపు అనుసృజన. యధావిధిగా శ్రీనివాస్ గారి కోసం ఫోన్ చేసాను. ప్రశాంత మైన కవి. కూల్ ఆటిట్యూడ్. కవిత్వం పై ఒక నిర్దిష్ట మైన అభిప్రాయం ఉన్న వ్యక్తి. మేటి తెలుగు కవుల జాబితా లో ఉన్న కట్టా ఇంటర్ చదివే సమయం లోనే (1990) ఆయన రాసిన ఓ బుల్లి కవిత కళాశాల మగజైన్ లో ప్రచురితమైంది. చదువు పై జిజ్ఞాస, కవిత్వం పై ఆసక్తి కి ఆయన తల్లి ఇన్స్పిరేషన్ అంటాడు. ఒక ఆశ్చ్యర్యకర మైన విషయమేమ౦టే, కట్టా గారి శ్రీమతి కూడా తన ఇంటర్ స్థాయి లో నుండే కవితలు రాసేవారంట. ఈ ఇద్దరి ముద్దుల కూతురు కట్ట రక్షిత ఒక బాల మేధావి. కట్టా శ్రీనివాస్ గారి సంకలనం విడుదల ఫంక్షన్ కు హాజరు అయిన రక్షిత, అక్కడ ‘కట్టా’ ను అభినందించడం చూసి, ఆ పసి హృదయం వేసిన ప్రశ్నలు ఆమె లో ఒక ఉత్సుకత ను రేపింది. “ ఎందుకు నాన్న, నిన్ను ఇంతగా పొగడుతున్నారు?” “ఇలా బుక్ రాస్తే, రాసిన వారిని పొగడుతారా?” కవిత (పోయెమ్) రాయడం గొప్ప విషయమా?” అని ప్రశ్నలు సంది౦చిన ఆ పసి రక్షిత, తర్వాత కవిత్వం లో మమేకమై “దారిలో లాంతరు” అనే కవిత సంకలనం తీసుకు రావడం, "అమృత లత" వారి నుండి అవార్డు కూడా అందుకొనిందని ఆయన చెప్పినప్పుడు, ఆయన మాటల్లో నిండైన గర్వం తొణికిసలాడింది. “నాకు ఏ అవార్డు రాకపోయినా” అనే పదాన్ని మధ్యలో జోడిస్తూ నవ్వుతూ చెప్పాడు. 2001 లో “మూడు బిందువులు” 2012 లో “ మట్టి వ్రేళ్ళు” ఆయన సంకలనాలు.
..
కవిత్వాన్ని గురించి చాలా సేపు మాట్లాడాడు. ఆ విషయాలన్నీ ఆయన మాటల్లోనే.....” నా ప్రతి కవిత నా ఫీల్. అనుభూతి లేనిదే నా కవిత లేదు. అందుకే నా కవిత ప్రయాణంలో విరామం ఉంటుంది. మొదట్లో నా కవిత్వ శైలి మోరల్ ను అందించే దిశగా ఉండేది. రాను రాను అనుభూతిస్తేనే కవిత రాయగలిగాను. కవిత్వం లో నేను మార్పు ను ఎక్కువగా ఆశిస్తాను. ఆ క్రమం లోనే శ్రుతి హసన్ ఆంగ్ల కవిత ను అనువదించాను, బాహుబలి చూసాక, అవంతిక పాత్ర పై “బహుదా బలి” అనే కవిత రాసాను. కవిత్వం అనేది మేధస్సుకు సంబందించింది కాదు. హృదయానికి సంబందించినది. కవిత్వం అటు పాటకుడిని, ఇటు కవిని ఆలోచింప చేయాలి. ఒక కవి భావం కానీ, అనుభూతి కానీ, అది express చేసే ప్రక్రియ, ఏ రూపం లోకి మారాలో అదే డిసైడ్ చేస్తుంది. అంటే, కవిత గానా. వ్యాసం గానా, కథ లాగా నా, ఇంకో ప్రక్రియ లోకా అనే అంశం. ఉదాహరణకు “నాన్న మాట” ఖచ్చితంగా కవిత రూపం లోనే రాయాలి. లేదంటే, నాలుగైదు పేజీల ఒక పెద్ద వ్యాసం గా రాయాల్సి ఉంటుంది. “ కవిత్వం అంటే నేను నాతో మాట్లుడుకొనే బాష” నా ఫీల్ కవిత లోకి transform అవుతుంది. కవిత్వం కొందరికి positive గా చేరినా ఒక విజయమే. కవిత్వం లో ఎప్పుడూ నిరాశ పడలేదు కానీ, విరామం అయితే తీసుకొన్నాను. కవిత పేపర్ పైన తయారయ్యే వరకు ఓ పెద్ద భారం మోసినట్లే. అది పేపర్ పైన వచ్చే సరికి ఆ బరువు ది౦పేసినట్లే. కవిత సంకలనం కు అంతా సిద్దం చేసుకొని, నా స్నేహితుడు నిర్మల్ కుమార్ దగ్గరకు వెళ్లాను. అక్కడ మాటల సందర్భం లో , కట్టా నీవు రాసిన ఒక కవిత చాల బాగుంది, అని చెపుతూ, నిర్మల్ కుమార్ తన డైరీ లోని నేను నా చేతి రాత తో రాసిన ఓ పేపర్ ను ఇచ్చాడు. అది నేను “స్వీట్ వైడ్ ఓపెన్” అనే సినిమా లో ఓ పనిపాప జీవితం చూసి, inspire అయ్యి రాసిన కవిత. అప్పుడు ఆ కవిత ను నేను నా సంకలనం లో జత చేసాను..... 
ఇలా కూల్ గా మాట్లాడుతూ, ఈ కవిత విషయం చెపుతూ, కవి యాకూబ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు “సాహిర్. (యాకూబ్ గారి కుమారుడు) తన తండ్రి కోసం తెచ్చిన కుర్చీ, ఆ తండ్రి కొడుకుల అనుబంధాలు, సాహిర్ కన్సర్న్ , ఇవన్నీ తమ సంభాషణ లలో దొర్లడమే ఈ కవిత ఆవిర్భావం అంటాడు. తండ్రి, ఆ తర్వాత కొడుకులకు పరంపర గా ఏమి పంచివ్వాలి? అని యాకూబ్ గారి ఇంటి నుండి వస్తూ ఆలోచిస్తూనే వచ్చానని చెప్తాడు. 
..
కట్టా గారిది ఎంత సున్నిత మరియు స్థిమిత మనస్తత్వం అంటే, ఆయన కవిత ను ఎంపిక చేసుకొని, “నేను ఓ పది నిముషాల్లో కాల్ చేస్తాను సర్... అని చెప్పి డిన్నర్ కు ఉపక్రమించాను. నేను, ఆయనకు ఫోన్ చేయడానికి. కాస్త ఆలస్యమైంది. డిన్నర్ అయ్యాక, వాట్స్ అప్ లో అయన పంపిన ఓ మెసేజ్ చూసాను. “సోదరా రేపు ఉదయాన్నే లేచి ప్రయాణం చేయాలి. మీరు పర్లేదు అంటే 10:30 కి నిద్ర పోతాను” అప్పుడు నాకు కవి అఫ్సర్ కట్టా గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. “స్థిమితత్వం కట్టా కున్న సోల్” అని. 
ఇది ఒక idiomatic సొగసు తో ఉన్న లోతైన కవిత. అనుసృజన ఆంగ్లం లోకి చేయడం కాస్త ఇబ్బంది అనిపించినా, ఆ పోయెమ్ లోని అంతర్యాన్ని బాగా ఎంజాయ్ చేసాను. ఆనుసృజన లో పూర్తి స్వేఛ్చ తీసుకొన్నాను. కవి ఆంతర్యం ఎరిగి. 
..
కట్టా శ్రీనివాస్ || నాన్న మాట ||
ఆనుసృజన : సి.వి.సురేష్ || THE WORD OF A FATHER||
..
Dad….!
When you were as ‘ son’
Being gained what else From ancestral….
You endorsed me this much, but
..
dad….
even after 20 years of your non-existence
Shall I plead one thing? 
Would you please give it to me!?
..
Entrust me….
To share the affection with patience..
To my kids..
With the existing strength by itself…
..
Dad…
Even in any of raise and falls …
Make me to learn 
How to Spread the hauteur courage as it is ….
..
Dad…
You are speaking with me….”
In every time, I exchange inspirational thoughts with my children……,
To hug the work
Not to flutter in the hard times…
Conscious in every paise…
N’ to cross with it in a cautious manner …”
..
Dad….
In the late hours... 
After i felt asleep…
When you were s rubbing my injected sticky hand…
I used to search In your indistinct face 
For a solution to decode the feelings of you… 
But, No clue gained by me…
Except becoming myself indistinct!
..
Dad…
what’s the difference 
between the existence and non existence….?
May not exist your thoughtful soul…
But, 
In supporting in every moment
In Accompanying every thought” 
Memory in a tender state
You will be there as long as I exist…!.
....
ఒరిజినల్ పోయెమ్ 
కట్ట శ్రీనివాస్ || నాన్న మాట || 
..
నాన్నా...
కొడుకుగా నువ్వున్నప్పుడు
ముందుతరాలనుంచీ
నీకు ఏమి అందటం వల్ల
నాకింతగా ఇచ్చావో కానీ,
నాన్నా
నువ్వు లేవంటున్న ఇరవై ఏళ్ళ తర్వాత
ఇంకొక్కటి అడుగుతా ఇస్తావుగా.
..
ఉన్న శక్తినే నా బిడ్డలకు
ఓపికతో పంచగల ప్రేమనివ్వు.
నాన్నా
ఎన్నిసార్లు సున్నానుంచి
మొదలు కావలసివచ్చినా
ఎగిరే జెండా పొగరు లాంటి
గుండెధైర్యాన్ని అచ్చంగా
అందించటమెలాగో తెలియనివ్వు.
..
నాన్నా..
పనిని ప్రేమగా హత్తుకోవడం
అలల నదిని దాటుతున్నవేళ సైతం తత్తరపడకపోవటం
ప్రతి పైసా బరువునీ గుండెతో తూచగలగటం అవసరాన్ని ఒడుపుగా దానితో దాటగలగటం
నా బిడ్డలకు కూడా చెప్పాలనుకున్న ప్రతీ సారీ నువ్వు నాతో మాట్లాడుతున్నావు.
..
నాన్నా...
సూదిమందుకి గడ్డకట్టిన
నా దండ చేతిని 
నేను ఎప్పటికో నిద్రపోయాక కొబ్బరినూనెతో రుద్దు తున్నప్పుడు ముభావంగా ఉన్న నీ ముఖం లోని భావాలని డీ కోడ్ చేసే హార్ట్ వేర్ కోసం వెతుకుతున్నప్పుడల్లా నేను ముభావంగా మారిపోతున్నానే కానీ దారం చిక్కలేదు.
నాన్నా..
అసలు ఉండటానికి లేకపోవడానికీ
తేడా ఏంటి?
ఆలోచించే దేహమే అయితే నువ్వులేకపోవచ్చు.
అనుక్షణం అండగా ఉండటం, 
ప్రతి ఆలోచనలో తోడుండటం 
జ్ఞాపకం తడిగా ఉండటం 
అయితే
నేనున్నన్ని నాళ్ళు నువ్వుంటావు.


కవిసంగమంలో ప్రచురితం

కామెంట్‌లు